Tuesday - 18 March, 2025 +91

GOVT TELANGANA SECRETARIAT VACANT 2014 (ALLOCATED)



**********తెలంగాణలో లక్షా 7 వేల పోస్టులు ఖాళీ***********
* ఆర్థిక శాఖ వెల్లడి
*హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో 118 ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుత లెక్కలను బట్టి మొత్తం 1,07,007 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు సచివాలయం మినహా మిగతా అన్ని విభాగాల్లోనూ కలిపి మొత్తం 5,21,608 పోస్టులు కేటాయించారు. ఆయా పోస్టుల వివరాలను క్యాడర్ల వారీగా తెలంగాణ ఆర్థిక శాఖ జులై 15న‌ వెల్లడించింది. ఒక్కో శాఖలోనూ ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పోస్టులు, అప్పట్లో ఖాళీలు ఎన్నేసి ఉన్నదీ తెలిపింది. వీటిలో తెలంగాణకు లభించిన హెడ్‌క్వార్టర్‌, క్షేత్ర స్థాయి పోస్టులు, తిరిగి వాటిలో ఖాళీలను వివరించింది. క్షేత్ర స్థాయి పోస్టులు ఏ రాష్ట్రంలో ఉన్నవి ఆ రాష్ట్రానికే చెందుతాయని, కేవలం రాష్ట్ర స్థాయి పోస్టుల్లోని ఉద్యోగులను, రాష్ట్ర స్థాయి పోస్టుల్లోని ఖాళీలను మాత్రమే ఉభయ రాష్ట్రాలకు విభజిస్తారని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆర్థిక శాఖ ఇప్పుడు వెల్లడించిన పోస్టుల వివరాలు ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నాయి. పూర్తి వివరాలు తెలంగాణ ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగుల తుది కేటాయింపులు పూర్తయ్యాక తెలంగాణ పోస్టులు, ఖాళీల్లో కొన్ని మార్పులు చోటుచేసుకోవచ్చు. ఇక ఉమ్మడి సచివాలయంలో మంజూరైన పోస్టులు 5,217 ఉండగా వాటిలో 1,875 ఖాళీగా ఉన్నాయి. తెలంగాణకు ఈ మొత్తం పోస్టుల్లో 1,202, ఖాళీల్లో 510 కేటాయించారు.
Click here to download 

0 comments:

Post a Comment