Home
/ అమ్మ ... ఆలోచిస్తున్న ...
అమ్మ ... ఆలోచిస్తున్న ...
అమ్మ ...
ఆలోచిస్తున్న ... నేను మాంసపు ముద్దలా
నీ కడుపులో ఉన్నప్పుడు
నా కోసం నువ్వు తీసుకున్న జాగ్రత్త లూ ....
అనుక్షణం నేను బయటికి
ఎప్పుడు వస్తానా అని ..
నాకోసం నువ్వు ఆలొచిస్థూ
గడిపిన ఎదురుచూపులు
ఈ ప్రపంచం నాకిప్పుడు తెలిసిందేమో ..
నా రూపం లేని శరీరాన్ని
నీ కడుపులో ఉంచుకుని
ఒక్కో రోజు నాకు రూపం ఇస్తూ
నన్ను మనిషిని చేసే సమయంలో
నువ్వు పడ్డ ఇబ్బందులు ...
ప్రాణాన్ని గుప్పిట బిగపట్టి
అనుభవించిన మానసిక ఒత్తిడులు...
ఆలోచిస్తున్నా..
నన్ను ఈ లోకానికి పరిచయం చేయబోతున్న రోజున
నన్ను బయటికి తీసిన రోజున
ప్రాణానికి తెగించి
నా కోసం మరణంతో
నువ్వు చేసిన పోరాటాలు ....
అమ్మ ..
నన్ను మొదటగా ముద్దాడిన
నీ పెదవులు
ఎమవుతుందో చెప్పలేక ఏడస్తున్న నన్ను
ఎలా అర్ధం చేసుకుని ఓదార్చాలో అని
నువ్వు పడ్డ ఇక్కట్లు ...
లోకాన్ని అర్ధం చేసుకోడానికి
నువ్వు నేర్పిన మాటలు
నన్ను నన్నుగా నిలబెట్టడానికి
నువ్వు నేర్పిన నడకలు ...
నన్ను అందరికన్నా ముందు ఉండమని
నూరిపోసిన ఉగ్గుపాల ప్రోత్సాహాలు ...
అందరితో ప్రేమించబడేలా
నాకు నేర్పిన ఆత్మీయ ఆప్యాయతలు ...
మనిషిగా నాకు ఉండాలని
నువ్వు నేర్పిన సంస్కారం .. మానవత్వాలు .
నాతో పాటు సహచర్యం చేసే మనుషుల పట్ల నా భాద్యతలు
ఎన్ని ఎన్ని ఎలా నేర్పావ్ అమ్మ ....
అమ్మ ....
ఇవ్వన్ని ఏ ఉపాద్యాయుడు నేర్పుతాడు ..
ఏ మత గురువు నేర్పుతాడు ..
ఏ బోధకుడు నేర్పుతాడు ..??
అది అమ్మ గా నీకు మాత్రమే తెలిసిన విద్య
శూన్యమైన నన్ను పూర్ణంగా మలచే శక్తి .. యుక్తి
నీకు తప్ప ఎవరికుంది అమ్మ ?? .
కన్న వారికోసం సుఖాలనే పట్టించుకోనంత
త్యాగం ఎవరికుంది అమ్మ ??
SAINADH REDDY
A to Z Info.org website dedicated to Young Indians. This website mainly focus on Education, Jobs, Tricks, Tips, Latest Technology Updates, Software's, Biographies of Eminent Personalities, Entertainment, Film News, Tutorials and many more. Please comment below how to improve our services
0 comments:
Post a Comment